హైదరాబాదులో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం... పలు ప్రాంతాల్లో వర్షం

12-04-2021 Mon 17:17
advertisement

గత కొన్నిరోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాదులో వర్షం పడడంతో ప్రజలు కాస్త ఊరట పొందారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా, పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఎస్సార్ నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఈసీఐఎల్, ఓల్డ్ బోయిన్ పల్లి, మల్లాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, ఫిలింనగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఎండలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. అయితే, ఈసారి 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ప్రజలు ఉక్కపోత, అధిక వేడిమితో సతమతమవుతున్నారు. వారికి ఉపశమనం కలిగిస్తూ తాజాగా నగరంలో వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు కూడా జంటనగరాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement