ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'మేజర్' టీజర్!

12-04-2021 Mon 17:17
advertisement

మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లేపై ఆయనకి మంచి అవగాహన ఉంది. అందుకే, ఆయన తన సినిమాల్లో టైట్ స్క్రీన్ ప్లే ఉండేలా చూసుకుంటాడు. ఆయన ఎంచుకునే కథల్లో అనూహ్యమైన మలుపులు .. ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించే కథలతో ఆయన తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయనున్నారు.


ఈ నేపథ్యంలో 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్, ఆకట్టుకునేలా ఉంది. ఒక వైపు ప్రేమ .. మరో వైపు దేశభక్తి .. ఇంకో వైపు త్యాగం .. ఇలా కథానాయకుడి జీవితాన్ని మూడు కోణాల్లో ఆవిష్కరిస్తూ అందించిన విజువల్స్ మనసుకు పడుతున్నాయి. ఫొటోగ్రఫీ బాగుందనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమయిపోతోంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాలనే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement