మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

12-04-2021 Mon 16:59
advertisement

సాధారణ జనజీవితం గడుపుతూ, కడవరకు జనాల్లో ఒకడిగా బతికిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా అడవి వెంకన్నగూడెం ఆయన స్వస్థలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఆయన భద్రాచలం నియోజకర్గంలో సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుంజా బొజ్జి ఈ ఉదయం మృతి చెందడంతో కమ్యూనిస్టు వర్గాల్లో విషాదం నెలకొంది.

బొజ్జి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుంజా బొజ్జి... గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement