జగన్ పై ఉన్న కేసులన్నీ నిజమైనవే: చంద్రబాబు

12-04-2021 Mon 15:08
advertisement

ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న కేసులన్నీ నిజమైన కేసులని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమపై బోగస్ కేసు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. తప్పుడు కేసులకు తెలుగుదేశం పార్టీ భయపడదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజులు ఉండదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని... తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలిస్తేనే జగన్ అరాచకాలు తగ్గుతాయని చెప్పారు. టీడీపీ హయాంలోని నరేగా బిల్లులు ఇంత వరకు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. నరేగా బకాయిలను చెల్లించేంత వరకు న్యాయబద్ధంగా పోరాడుతామని అన్నారు. ఇకపై కార్యకర్తల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ వీడియోను మార్ఫ్ చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

advertisement

More Flash News
advertisement
..more
advertisement