రమణ దీక్షితుల నియామకం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్దం: బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్

12-04-2021 Mon 08:36
advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులపై టీడీపీ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ దీక్షితులను తిరిగి ప్రధానార్చకుడిగా నియమించడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమన్నారు. సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు నిజంగా హరిభక్తుడేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

రమణ దీక్షితులను ప్రధానార్చకుడిగా నియమించడం ద్వారా బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అసలు బ్రాహ్మణులే లేనట్టు మల్లాది విష్ణుకు మూడు పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గత రెండేళ్లలో బ్రాహ్మణుల కోసం కేటాయించిన రూ. 244 కోట్లను ఎవరికి? దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలని వైసీపీ నేతలను ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement