తగ్గేదే లే... 'పుష్ప'రాజ్ లా విరాట్ కోహ్లీ... లైక్ కొట్టిన అల్లు అర్జున్

11-04-2021 Sun 14:58
advertisement

ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయంతో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకట్టుకునే సారథ్య లక్షణాలతో జట్టును నడిపించాడు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఆసక్తికర పోస్టుతో స్పందించింది. తగ్గేదే లే... ఆరంభం అదిరింది అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తరహాలో విరాట్ కోహ్లీ పిక్ ను పంచుకుంది.

ఓటమి సరిహద్దుల దాకా వెళ్లి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేశారని స్టార్ స్పోర్ట్స్ తెలుగు కితాబిచ్చింది. సరిలేరు మాకెవ్వరు అనే మాటకు నిదర్శనంగా నిలిచారని, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో కోహ్లీ మంత్రం ఫలించిందని, మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచేసిందని వివరించింది. కాగా ఈ పోస్టును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్టపడ్డారు. ఎమోజీలతో తన స్పందన తెలియజేశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement