తిరుమలలో కాబోయే సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ... ఘన స్వాగతం పలికిన అధికారులు!

11-04-2021 Sun 09:55
advertisement

ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఎన్వీ రమణ, నిన్న సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం నిమిత్తం రాగా, అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

ఆపై నిన్న రాత్రి నైవేద్య విరామ సమయంలో ఓ మారు స్వామిని దర్శించుకున్న ఆయన, ఈ ఉదయం మరోమారు స్వామిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ పూజారులు ఆయనకు దర్శనం చేయించి, అనంతరం ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం పలికారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement