రాధిక ఆరోగ్యంపై వదంతులు.. వారిని కోర్టుకు ఈడుస్తానన్న నటి

09-04-2021 Fri 11:43
Advertisement 1

తన ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న వారిని కోర్టుకు ఈడుస్తానని ప్రముఖ సినీనటి రాధిక హెచ్చరించారు. రాధిక కరోనా బారినపడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై రాధిక తాజాగా స్పందించారు. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై కొందరు పనిగట్టుకుని లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉదయం వారిని హెచ్చరిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు. తనకు కరోనా వైరస్ సోకలేదని ఆ ట్వీట్‌లో ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు వచ్చాయన్నారు. ఇప్పుడు బాగానే ఉన్నానని, తన ఆరోగ్యంపై కొందరు వదంతులు పుట్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు రాధిక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1