జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

09-04-2021 Fri 10:11
advertisement

జమ్మూకశ్మీర్‌లో ఈ ఉదయం వేర్వేరు చోట్ల జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయి. 


షోఫియాన్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో మసీదులో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement