ఆన్ లైన్ లో ఫుల్ హెచ్డీ క్లారిటీలో లీక్ అయిన 'ది బిగ్ బుల్'!

09-04-2021 Fri 07:00
Advertisement 1

పెరిగిపోతున్న పైరసీకి తాజాగా అభిషేక్ బచ్చన్, నికితా దత్తా, ఇలియానా తదితరులు నటించిన 'ది బిగ్ బుల్' బలైంది. కూకీ గులాటీ దర్శకత్వం వహించగా, అజయ్ దేవగణ్, పండిట్, విక్రాంత్ లు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఫుల్ హెచ్డీ వీడియోను తమిళ్ రాకర్స్ ఆన్ లైన్ లో లీక్ చేసింది.

1990 దశకం ఆరంభంలో స్టాక్ మార్కెట్ ను వణికించిన హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ్ రాకర్స్ తో పాటు ఇతర టోరెంట్ సైట్లలో ఈ చిత్రం ఉచితంగా డౌన్ లోడ్ కు అందుబాటులో ఉంది.

ఇండియాలో తాను తొలి బిలియనీర్ గా మారాలన్న ఉద్దేశంతో హేమంత్ షా అనే వ్యక్తి, ట్రేడింగ్ వ్యవస్థలోని లోపాలను సోపానాలుగా ఎలా మలచుకున్నాడన్న ఇతివృత్తంతో  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ గా ప్రదర్శించగా, అక్కడి నుంచే పైరసీదారులు దీన్ని తీసుకుని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. తాము ఎంతో శ్రమించి తీసిన చిత్రం, ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి రావడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. మూవీరూల్స్, టెలిగ్రామ్ తదితరాల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండటం గమనార్హం.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1