నేటి నుంచి ఐపీఎల్... ఐదు మైలురాళ్లపై కన్నేసిన హార్దిక్ పాండ్యా!

09-04-2021 Fri 06:45
Advertisement 1

తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, భారత జట్టులో సుస్ధిర స్థానం దిశగా వెళుతున్న యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ - 14వ సీజన్ లో ఐదు మైలురాళ్లపై కన్నేశాడు. బ్యాట్స్ మెన్ గా, బౌలర్ గా, అద్భుతమైన ఫీల్డర్ గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న ఆ ఐదు రికార్డుల గురించి ఓ సారి పరిశీలిస్తే...

హార్దిక్ మరొక్క క్యాచ్ ని పట్టుకుంటే, ఐపీఎల్ లో 50 క్యాచ్ లను పూర్తి చేసుకుంటాడు. మరో 11 క్యాచ్ లను ఈ సీజన్ లో పట్టుకుంటే, టీ-20 పోటీల్లో 100 క్యాచ్ లను తీసుకున్న మైలురాయికి చేరుకుంటాడు.

గత సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు, హార్దిక్ కు పెద్దగా బౌలింగ్ అప్పగించలేదు. అయితే, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ అనంతరం, అతనిలోని బౌలింగ్ సత్తా గురించి కూడా అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ సీజన్ లో హార్దిక్, ఎంఐ టీమ్ కు కీలకంగా మారాడు. మరో 8 వికెట్లను హార్దిక్ తీస్తే, 50 వికెట్లను తీసుకున్న ఆటగాడవుతాడు.

ఇప్పటివరకూ హార్దిక్ ఐపీఎల్ పోటీల్లో 159 స్ట్రయిక్ రేట్ తో 1,349 పరుగులు చేశాడు. మరొక్క 6 సిక్స్ లు కొడితే, 100 సిక్స్ లను కొట్టిన ఘనత హార్దిక్ సొంతమవుతుంది. మరొక్క 14 బౌండరీలను సాధిస్తే, టీ-20 లీగ్ పోటీల్లో 100 సెంచరీలను సాధించిన వాడవుతాడు. ప్రస్తుతం హార్దిక్ ఫామ్ ను చూస్తే, ఈ రికార్డులన్నీ అతని ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోందన్నది క్రీడా పండితుల అభిప్రాయం.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1