నేను సవాల్ విసిరి 24 గంటలైంది... జగన్ ఇప్పటివరకు స్పందించలేదు: నారా లోకేశ్

08-04-2021 Thu 21:53
advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుపతి లోక్ సభ స్థానం అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున వెంకటగిరిలో ప్రచారం చేశారు. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. వివేకా హత్య కేసులో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని జగన్ కు సవాల్ విసిరి 24 గంటలైందని వెల్లడించారు. తన సవాల్ కు జగన్ ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు. ఈ నెల 14న తిరుపతి వస్తున్న జగన్... తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయనకు, ఆయన కుటుంబానికి వివేకా హత్యకేసుతో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ముందా? అని మరోసారి సవాల్ విసిరారు.

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. గత కొన్నిరోజులుగా నారా లోకేశ్ ఇక్కడే మకాం వేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, నేడు పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారానికి విచ్చేశారు. ఆయన శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement