కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న సచిన్ టెండూల్కర్

08-04-2021 Thu 18:47
Advertisement 1

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి బయటపడ్డారు. సచిన్ కు మార్చి 27న కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఆయన ముందు జాగ్రత్తగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.

ఆసుపత్రి నుంచి ఇప్పుడే ఇంటికి చేరుకున్నానని, కోలుకునే క్రమంలో మరికొన్నిరోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని సచిన్ తెలిపారు. తనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధ చూపించారని, ఎంతో మెరుగైన సేవలు అందించారని సచిన్ కొనియాడారు. గత ఏడాది కాలంగా కరోనా చికిత్సలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారని కీర్తించారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1