దిల్ రాజు సోదరుడి తనయుడు హీరోగా రౌడీ బాయ్స్... మోషన్ పోస్టర్ విడుదల
08-04-2021 Thu 18:34
- సినీ రంగంలో మరో వారసుడి తెరంగేట్రం
- శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా చిత్రం
- హర్ష కొనుగంటి దర్శకత్వంలో రౌడీ బాయ్స్
- ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. జూన్ 25న రిలీజ్
Advertisement 1
సినీ ఇండస్ట్రీలో వారసత్వం కొత్త కాదు. మొదటి నుంచీ ఎంతోమంది వారసులు ఇక్కడ ప్రవేశించి రాణించారు. ఇదే కోవలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్ పుల్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న 'రౌడీ బాయ్స్' అనే చిత్రంతో ఆశిష్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం పంచుకుంది.
యూత్ ను ఉద్దేశించి సాగే హుషారైన ఓ పాట నేపథ్యంలో మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ఈ రౌడీ బాయ్స్ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
Advertisement 1
More Flash News
అనిల్ రావిపూడికి రామ్ గ్రీన్ సిగ్నల్!
6 minutes ago
కరోనా నియంత్రణ చర్యల పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
17 minutes ago
కరోనా విజృంభణ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం!
33 minutes ago
Advertisement 1
చిరూకి కథ చెప్పిన 'మహర్షి' డైరెక్టర్!
1 hour ago
'పుష్ప' యాక్షన్ సీన్స్ కోసం 39 కోట్ల ఖర్చు?
1 hour ago
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
1 hour ago
218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
2 hours ago
దేశంలో కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ
2 hours ago
Advertisement 1