ముంబైలో 'లైగర్' షూటింగుకు బ్రేక్ పడిందట!

08-04-2021 Thu 18:01
Advertisement 1

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతుతోంది. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథ. అందువలన చాలా రోజులుగా పూరి అక్కడే ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. విజయ్ దేవరకొండ .. అనన్య పాండేతో పాటు ఇతర ముఖ్య పాత్రధారులంతా ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. అయితే ముంబైలో కొన్ని రోజులుగా కరోనా కేసులు అనూహ్యమైన రీతిలో పెరిగిపోతున్నాయి. మున్ముందు అక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది తెలియని పరిస్థితిగా ఉంది. అందువలన 'లైగర్' షూటింగును ఆపేశారట.

సాధారణంగా పూరి చాలా వేగంగా చిత్రీకరణను పూర్తి చేస్తాడు. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో ఆది నుంచి ఏవో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. అంతేకాదు కరోనా కూడా అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అందువల్లనే ఆలస్యమవుతూ వచ్చింది. గతంలో ఒకసారి కరోనా తీవ్రత కారణంగా షూటింగు ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ముంబైలో షూటింగు ఆపేసిన ఈ సినిమా టీమ్ హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. ఇకపై ముంబై వెళ్లకుండా హైదరాబాద్ లోనే షూటింగు కానిచ్చేయాలనే అభిప్రాయంతో పూరి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1