నేడు కూడా లాభాల్లోనే ముగిసిన దేశీయ మార్కెట్లు

08-04-2021 Thu 17:33
Advertisement 1

నిన్న భారీ లాభాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఓ మాదిరి లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఉదయం మార్కెట్లు ఉత్సాహంగానే ప్రారంభమవడంతో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు లాభాన్ని పొందింది. అయితే, మధ్యాహ్నం వరకు జోరుగానే వున్న మార్కెట్లు ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీ లాభాలు హరించాయి.

దీంతో మెటల్ స్టాక్స్ అండతో చివరికి సెన్సెక్స్ 84.45 పాయింట్ల లాభంతో 49,746.21 వద్ద ... నిఫ్టీ 54.75 పాయింట్ల లాభంతో 14,873.80 వద్ద ముగిశాయి. ఇక నేటి సెషన్ లో జేఎస్ డబ్ల్యు స్టీల్, జిందాల్ స్టీల్, సెయిల్, టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్, టైటాన్ కంపెనీ తదితర షేర్లు లాభాలు గడించగా.. ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ బ్యాంక్, టోరెంట్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు పొందాయి.  

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1