భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఇండియా నుంచి ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

08-04-2021 Thu 10:57
Advertisement 1

భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం విధించింది. భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం నాలుగు గంటల నుంచే ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాదు, భారత్ నుంచి వచ్చే స్వదేశీయులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెల 28వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. న్యూజిలాండ్‌లో తాజాగా వెలుగుచూసిన 23 కేసుల్లో 17 భారత్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో గుర్తించినవే కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1