సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం    

08-04-2021 Thu 07:28
Advertisement 1

*  చాలా కాలం తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయికగా పూజ హెగ్డే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో 'మహర్షి' సినిమాలో మహేశ్, పూజ జంటగా నటించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. రేపటి నుంచి చరణ్ ఈ చిత్రం ఫైనల్ షూటింగులో పాల్గొంటాడు. అతనిపై ఓ విప్లవ గీతాన్ని చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూలుతో చరణ్ షూటింగ్ పూర్తవుతుంది.  
*  'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ అందుకున్న కథానాయిక నభా నటేష్ ఇప్పుడు నితిన్ సరసన 'మాస్ట్రో' సినిమాలో నటిస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఇప్పుడీ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడితో చర్చించానని, ఆయన కూడా తనను ఎంకరేజ్ చేశారనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని  చెప్పింది.    

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1