నన్ను స్టయిలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా మార్చేశాడు: అల్లు అర్జున్

07-04-2021 Wed 21:22
Advertisement 1

హైదరాబాదులో ఇవాళ పుష్ప ఫస్ట్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో అల్లు అర్జున్ పుష్ప టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట ఫ్యాన్స్ గురించే ప్రస్తావించారు. వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని వినమ్రంగా తెలిపారు.

"ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పుట్టినరోజుకు అభిమానులు చూపుతున్న ప్రేమ కంటే ఇంకేం ఎక్కువ అవసరంలేదు. సుకుమార్ నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి. స్టయిలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా మార్చేశాడు. ప్రతిదీ గుర్తుండిపోయేలా విజయాలు అందించాడు. ఇక, నేనేం చేసినా అభిమానుల కోసమే. నా జీవితం వారికి అంకితం.

పుష్ప చిత్రంలోని తగ్గేదే.. లే డైలాగు సినిమాలోనే కాదు.. నా జీవితంతోనూ సంబంధం ఉన్న డైలాగు. అనేక కష్టనష్టాల్లో ఉన్నప్పుడు నన్ను నేను ఉత్సాహపరచుకునేటప్పుడు తగ్గేదే.. లే అని అనుకుంటాను. ధైర్యంతో ముందడుగు వేస్తే విజయం మనదే అని ఆ డైలాగు చెబుతోంది. నిజజీవితానికీ అది వర్తిస్తుంది.

పుష్ప కూడా పాన్ ఇండియా ఫిలిం. అనేక పాన్ ఇండియా చిత్రాల నడుమ పుష్ప కూడా వస్తోంది. చించేయాల్సిన బాధ్యత అభిమానులదే. ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే తను కూడా మైండ్ లో తగ్గేదే.. లే అని ఫిక్సయినట్టున్నాడు. అదిరిపోయే సంగీతం అందించాడు. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. చాలాకాలంగా నేను, సుకుమార్, దేవి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఈ సినిమాలోనూ మేం అభిమానులను మెప్పిస్తాం" అని పేర్కొన్నారు. చివర్లో ఓ భారీ కేక్ ను కట్ చేసి అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1