ఏపీ సీఎం జగన్ నన్ను భౌతికంగా అంతం చేయాలని చూస్తున్నారు: ప్రధానికి లేఖలో రఘురామకృష్ణరాజు ఆరోపణ

07-04-2021 Wed 20:23
Advertisement 1

ఏపీ సీఎం జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వై కేటగిరీ భద్రతను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని రఘురామకృష్ణరాజు వివరించారు.

ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానని, అయితే, సీఎం జగన్ నేరచరిత్ర కారణంగా ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. గత కొన్ని వారాలుగా తనపై తప్పుడు కేసుల నమోదుకు ప్రయత్నాలు చేశారని, కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.

"విశ్వసనీయ వర్గాల నుంచి నాకు అందిన సమాచారం ప్రకారం... నన్ను భౌతికంగా లేకుండా చేసేందుకు కడప జిల్లాలో తనకున్న పాత పరిచయాల ఆధారంగా కొందరు ప్రొఫెషనల్ కిల్లర్స్ సాయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే నా భద్రతపై పునఃపరిశీలన చేయాలని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఓ గన్ మన్ ఎల్లప్పుడూ నా వెంటే ఉండేలా చర్యలు తీసుకోండి. ఇప్పటివరకు నాకు ఏపీలోనూ, హైదరాబాదులోనూ ఉన్నప్పుడే వై కేటగిరీ వర్తింపజేస్తున్నారు. ఇప్పుడా భద్రతను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను" అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1