అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెడుతున్న 'జాతిరత్నాలు'

07-04-2021 Wed 18:31
Advertisement 1

'జాతిరత్నాలు' .. నిజానికి ఇదో చిన్న సినిమా .. అనుదీప్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమా  ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ అబ్బాయి తీసిన ఒక షార్టు ఫిల్మ్ చూసి నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించాడు. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ద్వారా, ఫారియా అబ్దుల్లా పరిచయమైంది. విడుదలకి ముందువరకూ ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ ప్రమోషన్స్ కొత్తగా చేయడంతో ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 'ఉప్పెన' వసూళ్లను క్రాస్ చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


ఇంత హిట్ అయింది కదా .. బరువైన కథా? అనుకుంటే అదీలేదు.. దర్శకుడు  తేలికపాటి కథాకథనాలతో సరదాగా నవ్విస్తూ, హాయిగా థియేటర్లో గడిపాము అనుకునేలా చేశాడు. అలాంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. చూసినవాళ్లు మళ్లీ చూడటానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1