ఏపీలో మరో 2,331 మందికి కరోనా...11 మంది మృతి

07-04-2021 Wed 18:06
Advertisement 1

ఏపీలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 31,812 కరోనా పరీక్షలు చేపట్టగా 2,331 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అనేక జిల్లాల్లో మూడంకెల్లో కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 853 మంది కోలుకోగా... 11 మంది మహమ్మారికి బలయ్యారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృత్యువాతపడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,262కి పెరిగింది.  

రాష్ట్రంలో ఇప్పటివరకు 9,13,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,92,736 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,276 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1