రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్

07-04-2021 Wed 14:54
Advertisement 1

టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను కలిసినవాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అటు బాలీవుడ్ లోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్ లో పలువురు తారలు కరోనా బాధితుల జాబితాలో చేరారు. అమీర్ ఖాన్, గోవిందా, అక్షయ్ కుమార్, బప్పీ లహరి, అలియా భట్, మాధవన్ వంటి సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ అని తేలింది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1