"కదులు కదులు కదులు"... వకీల్ సాబ్ చిత్రం నుంచి రోమాంఛక గీతం ఇదిగో!

07-04-2021 Wed 14:34
Advertisement 1

పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి ఓ ప్రబోధాత్మక గీతం విడుదలైంది. 'కదులు కదులు కట్లు తెంచుకుని కదులు' అంటూ సాగే ఈ రోమాంఛక గీతాన్ని చిత్రయూనిట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది.

తమన్ బాణీలకు సీనియర్ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' నుంచి విడుదలైన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఈ 'కదులు కదులు' సాంగ్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతం తమన్ ఆర్కెస్ట్రయిజేషన్ లో మరింత ఊపు తెచ్చేదిగా ఉంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వకీల్ సాబ్' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1