ఎస్ఈసీ పిటిష‌న్‌పై హైకోర్టులో ముగిసిన వాద‌న‌లు

07-04-2021 Wed 13:28
Advertisement 1

ఏపీలో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై హైకోర్టు డివిజ‌న్ బెంచ్ లో వాద‌న‌లు ముగిశాయి. దీనిపై తీర్పును మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మాసనం వెల్ల‌డించ‌నుంది.

ఈ రోజు కోర్టులో ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి, టీడీపీ నేత‌ వర్ల రామయ్య తరఫున‌ సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్ర‌హ్మ‌ణ్యం వాదనలను వినిపించారు. టీడీపీ నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి కొట్టేయాల‌ని ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి కోర్టుకు విన్న‌వించారు. హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెల‌కొంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1