నలుగురు ప్ర‌ధాన‌ అర్చకులను నియ‌మిస్తూ టీటీడీ ఉత్త‌ర్వులు

07-04-2021 Wed 13:14
Advertisement 1

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులను నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నలుగురు ప్ర‌ధాన‌ అర్చకులను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్న‌ట్లు వివ‌రించింది.

గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులను, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులను, పైడపల్లి నుంచి రాజేశ్ దీక్షితులను, అలాగే, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తున్న‌ట్లు పేర్కొంది. కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని వివ‌రించింది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1