జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యంపై త‌న వాద‌న‌లు వినిపించిన ఎస్ఈసీ!

07-04-2021 Wed 12:58
Advertisement 1

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విష‌యంలో హైకోర్టులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఈ రోజు విచారణ జ‌రుపుతోంది.

టీడీపీ నేత వర్ల రామయ్య ప‌రిష‌త్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో ఆయన వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి కొట్టేసి ఉండాల్సిందని ఎస్‌ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. అలాగే, 4 వారాల ముందే ఎన్నికల ప్రవర్తనా నియమావళి  విధించాలనే చట్టబద్ధ నిబంధన లేదని చెప్పారు.

ఎన్నికల కోడ్‌ అమలు విషయంలో విచక్షణాధికారం ఎస్‌ఈసీకే ఉంటుందని ఆయ‌న చెప్పారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అయితే, ఎస్ఈసీ చెబుతోన్న ప‌లు అంశాల‌పై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. స‌రైన ప‌త్రాల‌తో త‌మ ముందుకు రావాల‌ని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ జ‌డ్జి వ‌ద్ద ఎన్నిక‌ల కోడ్‌కు సంబంధించిన వాద‌న‌లు వినిపించారా? అని ప్ర‌శ్నించింది. అయితే, వాద‌న‌కు స‌మ‌యం స‌రిపోలేద‌ని ఎస్ఈసీ త‌ర‌ఫు న్యాయ‌వాది డివిజ‌న్ బెంచ్ కు తెలిపారు. ఈ అంశాల‌పై ప్ర‌తివాదుల త‌ర‌ఫున వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1