మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా ఖాయమే!

07-04-2021 Wed 12:05
Advertisement 1

రవితేజ జోరు మామూలుగా లేదు .. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నాడు. ఇటీవల వచ్చిన 'క్రాక్' హిట్ తో ఆయన తన దూకుడును మరింత పెంచాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆయన 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది.

ఆ తరువాత చేసే ప్రాజెక్టును కూడా రవితేజ లైన్లో పెట్టేశాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. యూత్ ను .. మాస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ నడవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం త్రినాథరావు ఈ ప్రాజెక్టు పనిలోనే బిజీగా ఉన్నాడు.

ఇక ఆ తరువాత సినిమాను మారుతి దర్శకత్వంలో రవితేజ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందే మారుతి .. రవితేజకు ఒక కథను వినిపించడం .. ఆ కథకు రవితేజ ఓకే చెప్పడం జరిగిపోయాయి. అయితే బడ్జెట్ విషయం.. పారితోషికం విషయం కారణంగా ఆ ప్రాజక్టు ముందుకు వెళ్లలేదు.

దాంతో మారుతి ఇప్పుడు వేరే నిర్మాతను ఎంటర్ చేశాడట. అందువలన ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. అందువలన రవితేజ - మారుతి కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే. ప్రస్తుతం గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న మారుతి, ఆ తరువాత ప్రాజెక్టుగా రవితేజ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1