పాన్ ఇండియా సినిమా కోసం జార్జియాకి విజయ్!

07-04-2021 Wed 10:18

advertisement

తమిళనాట మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరో విజయ్. ఆయన సినిమా ఒకటి సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి మాస్ ఫ్యాన్స్ దానిని ఫాలో అవుతూనే ఉంటారు. విజయ్ సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర జాతర మొదలవుతుంది. వసూళ్ల విషయంలో ఆయన రికార్డులను ఆయనే అధిగమిస్తూ వెళుతుంటాడు. ఆయనతో ఒక సినిమా చేసినా చాలని అనుకోని హీరోయిన్స్ ఉండరు. అలాంటి విజయ్ 'మాస్టర్' హిట్ తరువాత మరో సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకు 65వ సినిమా. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

దర్శకుడు నెల్సన్ కథలు విభిన్నంగా ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో  నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన 'కొలమావు కోకిల' చూస్తే అర్థమైపోతుంది. అందువల్లనే విజయ్ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను 'జార్జియా'లో ప్లాన్ చేశారట. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే నిన్న విజయ్ 'జార్జియా' బయల్దేరినట్టుగా చెబుతున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విజయ్ కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మితం కావడం, ఈ సినిమా కోసం పూజా హెగ్డే రెట్టింపు పారితోషికం అందుకుంటూ ఉండటం విశేషం.

advertisement

More Flash News
advertisement
..more
advertisement