తెలంగాణలో కొత్త‌గా 1,914 కరోనా కేసులు

07-04-2021 Wed 09:56
Advertisement 1

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,914 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 285 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,298 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,734గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 11,617 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,634 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 393 మందికి క‌రోనా సోకింది.
 
   

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1