'ఫిదా' కథను తొలుత మహేశ్ బాబుకు, ఆపై రామ్ చరణ్ కు చెప్పా: శేఖర్ కమ్ముల

07-04-2021 Wed 08:36
Advertisement 1

సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'ఫిదా' స్టోరీని తొలుత మహేశ్ బాబుకు, ఆపై రామ్ చరణ్ కు చెప్పానని, వారికి కుదరకపోవడంతోనే ఆ సినిమా చేసే అవకాశం వరుణ్ తేజ్ కు వచ్చిందని దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు. ఓ టీవీ చానెల్ లో అలీ వ్యాఖ్యతగా ప్రసారం అవుతున్న కార్యక్రమంలో పాల్గొన్న శేఖర్ కమ్ముల, ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు.

చిరంజీవి నటించిన శంకర్ దాదా విడుదలైన సమయంలోనే తాను దర్శకత్వం వహించిన 'ఆనంద్' కూడా రిలీజైందని గుర్తు చేసుకున్న శేఖర్, ఆ సమయంలో మిత్రుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న పది మంది యువకులను ఆ సినిమాకు తీసుకుని వెళ్లానని అన్నారు. తాను తీస్తున్న సినిమాల్లో బ్రహ్మానందం, అలీ వంటి కామెడీ నటులు ఉంటే బాగుంటుందని తన ఇంట్లోని వారు అంటుంటారని అన్నారు.

తన కొత్త చిత్రం 'లవ్ స్టోరీ'లో పెట్టిన సారంగదరియా పాటపై వివాదం చెలరేగిన విషయాన్ని అలీ ప్రస్తావించగా, భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 12న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1