యోగి, షాలను చంపేందుకు 11 మంది ఆత్మాహుతి బాంబర్లు రెడీగా ఉన్నారు: అజ్ఞాతవ్యక్తి ఈ-మెయిల్

07-04-2021 Wed 06:34
Advertisement 1

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను చంపేస్తామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి నిన్న వచ్చిన ఈ-మెయిల్ కలకలం రేపింది. దేశంలోని ప్రార్థనా మందిరాల వద్ద కూడా విధ్వంసం సృష్టిస్తామని ఆ లేఖలో పేర్కొన్నాడు.

ముంబై సీఆర్‌పీఎఫ్ కార్యాలయానికి వచ్చిన ఈ లేఖలో... యోగి, షాలను మట్టుబెట్టేందుకు11 మంది ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. లేఖతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిద్దరికీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. కేసు నమోదు చేసుకుని లేఖ ఎక్కడి నుంచి వచ్చిందీ ఆరా తీస్తున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1