సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

06-04-2021 Tue 21:05
Advertisement 1

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించిన ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న తరుణంలో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఉపశమన చర్యలు ప్రకటించారని చిరంజీవి తెలిపారు. ఈ రాయితీలు సినీ రంగానికి అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు కోలుకుంటాయని వివరించారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1