మీ మరిది హత్యతో మీ కుటుంబంలో ఏ ఒక్కరికీ సంబంధంలేదని బైబిల్ సాక్షిగా చెప్పగలవా?: విజయమ్మకు అచ్చెన్నాయుడు సవాల్

06-04-2021 Tue 20:57
Advertisement 1

వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల రాజన్నకోట రహస్యం ప్రపంచానికి తెలియాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. బాత్రూంలో బాబాయ్ పై పడిన గొడ్డలి పోటుకు సమాధానం చెప్పాల్సింది అబ్బాయేనని తెలిపారు. నాడు ఈ కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్ నేడు సీబీఐ విచారణ అంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని ప్రశ్నించారు.

పుత్రప్రేమ పొరలు కమ్మేయడం వల్ల విజయమ్మ రక్తపు మరకలు తుడిచే లేఖలు రాస్తోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. 'సునీత కూడా మీ షర్మిలలాంటి బిడ్డే కదమ్మా... ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా?' అని నిలదీశారు. 'మీ మరిది హత్యతో మీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ సంబంధంలేదని బైబిల్ సాక్షిగా చెప్పగలవా?" అంటూ విజయమ్మకు సవాల్ విసిరారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1