ఆటిజం ప్రభావిత కుటుంబాలకు సాయం చేసేందుకు ఉచిత హెల్ప్ లైన్ నెంబర్

06-04-2021 Tue 20:14
Advertisement 1

ఆటిజం... ఉజ్వలంగా ఎదగాల్సిన చిన్నారులకు శాపం వంటిదీ లోపం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు ఆటిజం కారణంగా మానసిక ఎదుగుదల లేకుండా బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. వారిలో నాడీపరమైన బలహీనతలు కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు నిజంగా వేదనాభరితమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో ఆటిజంతో బాధపడే చిన్నారులు, వారి తల్లితండ్రులకు సాయపడేలా పిన్నాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ సంస్థ ఉచిత హెల్ప్ లైన్ నెంబరు (9100 181 181) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ నెంబరుకు కాల్ చేయడం ద్వారా ఉచితంగా కౌన్సిలింగ్, మార్గదర్శనం చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆటిజం చికిత్స కేంద్రాల గురించి, ఆటిజం చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ టోల్ ఫ్రీ నెంబరు ద్వారా వివరిస్తారు.

కాగా, ఈ కార్యాచరణకు సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ సినీ నటుడు నాగబాబు ఆవిష్కరించారు. ఆటిజం చిన్నారులు కూడా అందరిలాగే జీవనం సాగించేందుకు కృషి చేస్తున్న పిన్నాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ వ్యవస్థాపకులు నిజంగా అభినందనీయులని పేర్కొన్నారు. వారి ప్రయత్నాలు సఫలం అవ్వాలని, ఆటిజం చిన్నారుల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు నాగబాబు తెలిపారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1