వర్మ వదులుతున్న మరో 'దెయ్యం' కథ!

06-04-2021 Tue 20:01
advertisement

రాజశేఖర్ కథానాయకుడిగా వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దెయ్యం' సినిమా, ఈ నెల 16వ తేదీన థియేటర్లకు రానుంది. రీసెంట్ గా వర్మ ఈ సినిమా చేస్తున్నట్టుగా ఎక్కడా చెప్పలేదే .. రాజశేఖర్ కూడా మాట మాత్రం అనలేదే అని బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. ఈ సినిమా పాతదే .. టైటిల్ మాత్రమే మార్చేసి వర్మ వదిలేస్తున్నాడు. ఆ మధ్య రాజశేఖర్ నిర్మాణంలో 'పట్టపగలు' అనే హారర్ మూవీ రూపొందింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, 'పట్ట పగలు' పేరుతోనే ట్రైలర్లు గట్రా వదిలారు.


ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ .. ఈ సినిమాను గురించి అంతా మరిచిపోయారు. ఇప్పుడు అదే సినిమాను 'దెయ్యం' పేరుతో వర్మ రిలీజ్ చేస్తున్నాడు. హీరో ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతురుకి దెయ్యం పడుతుంది. ఆ దెయ్యానికి .. హీరో కుటుంబానికి సంబంధం ఏమిటి? అప్పుడు హీరో ఏం చేశాడు? అనేదే కథ. రాజశేఖర్ కూతురుగా స్వాతి దీక్షిత్ నటించిన ఈ సినిమాను, తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను విడుదల చేస్తుండటం విశేషం.

advertisement

More Flash News
advertisement
..more
advertisement