ఏపీలో ఒక్కరోజులో 1,941 కరోనా పాజిటివ్ కేసులు

06-04-2021 Tue 17:02
Advertisement 1

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 31,657 కరోనా టెస్టులు నిర్వహించగా 1,941 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 424 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు తర్వాత అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 258, నెల్లూరు జిల్లాలో 231, కృష్ణా జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు గుర్తించారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 835 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటివరకు 9,10,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,91,883 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 11,809 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 7,251కి పెరిగింది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1