కొండపోచమ్మ సాగర్ నీటిని హల్దీ వాగులోకి విడుదల చేసిన సీఎం కేసీఆర్
06-04-2021 Tue 16:46
- తెలంగాణలో మరో జల కార్యక్రమం
- కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ చేరుకున్న జలాలు
- కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్ పూజలు
- కొండపోచమ్మ సాగర్ జలాలు మంజీరా నది నుంచి నిజాం సాగర్ తరలింపు
Advertisement 1
తెలంగాణలో మరో జల కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని హల్దీ వాగులోకి వదిలారు. ఆపై ఆ నీటిని మంజీరా నది నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు తరలిస్తారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాలు మేడిగడ్డ, మిడ్ మానేరు మీదుగా కొండపోచమ్మ సాగర్ చేరుకున్నాయి.
నేడు సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి వద్ద సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. అటు, కొండపోచమ్మ సాగర్ నుంచి గజ్వేల్ కెనాల్ ద్వారా సిద్ధిపేట జిల్లాలోని 20 చెరువులు నింపేందుకు విడుదల చేశారు. ఈ జల కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement 1
More Flash News
తిరుపతి ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
11 minutes ago
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్... ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్
28 minutes ago
ఏదో ఒకరోజు సీఎం అవుతా: లోటస్ పాండ్ లో షర్మిల వ్యాఖ్యలు
42 minutes ago
Advertisement 1
'నీట్' పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
2 hours ago
బాలయ్య సినిమాలో వేటపాలెం గ్యాంగ్ ఫైట్?
2 hours ago
Advertisement 1