సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కున్న హీరో అజిత్

06-04-2021 Tue 15:02
Advertisement 1

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.

ఈ క్రమంలో ఓ అభిమాని మరీ ముందుకొచ్చి అజిత్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడు మాస్కు లేకుండా కనిపించడంతో ఆగ్రహించిన అజిత్ ఆ యువకుడి నుంచి ఫోన్ లాక్కొన్నారు. ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపలికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ ను తిరిగి అభిమానికి ఇచ్చేశారు. వెళుతూ వెళుతూ క్షమాపణ కూడా చెప్పారు. దాంతో ఆ అభిమాని ఓకే సార్ అంటూ స్పందించాడు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1