హైదరాబాద్​ పాతబస్తీలో మహిళలతో ఓ పార్టీ నేత అశ్లీల నృత్యాలు

06-04-2021 Tue 13:46
Advertisement 1

ఆయనో ప్రముఖ పార్టీకి చెందిన నేత. స్నేహితులను పిలిచి పెద్ద మందు, విందు పార్టీ ఇచ్చారు. మందు, విందుతో పాటే మహిళలతో అశ్లీల నృత్యాలూ చేశారు. పాతబస్తీలోని బండ్లగూడలో ఫిబ్రవరి 13న జరిగిన ఈ పార్టీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ అశ్లీల నృత్యాలకు సంబంధించి పర్వేజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు  చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు.

పార్టీ జరిగిన టైంలోనే దాడి చేస్తే మరిన్ని వివరాలు తెలిసేవన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో విచారిస్తున్నామని, ఇక్కడి వారేనా? లేక వేరే రాష్ట్రాల నుంచి పిలిపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1