'ఎఫ్ 3' కంటే ముందుగానే 'దృశ్యం 2' రిలీజ్?

06-04-2021 Tue 11:35
Advertisement 1

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేశ్ మరింత స్పీడ్ చూపిస్తున్నారు. విభిన్నమైన కథల్లో .. విలక్షణమైన పాత్రల్లో ఆయన దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలో ఆయన నుంచి చాలా తక్కువ గ్యాప్ లో మూడు సినిమాలు రానుండటం విశేషం.

తమిళంలో 'అసురన్' రీమేక్ గా ఆయన చేసిన 'నారప్ప' .. మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ లుక్ తోనే వెంకటేశ్ అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు తిప్పేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకీ సరసన నాయికగా ప్రియమణి కనిపించనుంది.


ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక వైపున 'ఎఫ్ 3' సినిమాను చేస్తూనే, మరో వైపున జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 'దృశ్యం 2' సినిమాను చేస్తున్నారు. ఆల్రెడీ 'ఎఫ్ 3' సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగస్టు 27వ తేదీన దీనిని విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే చెప్పారు. దాంతో 'దృశ్యం 2' సినిమాను దసరా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు.

కానీ, 'ఎఫ్ 3' కంటే ముందుగానే 'దృశ్యం 2' థియేటర్లకు రానుందని తెలుస్తోంది. జూన్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. 'దృశ్యం 2' తండ్రి పాత్ర ప్రధానంగా సాగే కథ కావడం వలన, 'ఫాదర్స్ డే' సందర్భాన్ని పుస్కరించుకుని ఈ రిలీజ్ డేట్ ను ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. ఏమైనా, ఈ  ఏడాది వెంకటేశ్ దూకుడు మామూలుగా లేదనే చెప్పుకోవాలి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1