'టక్ జగదీశ్' టక్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందట!

06-04-2021 Tue 11:03

Advertisement 1

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు నాని కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. పాత్ర ఏదైనా .. ఎలాంటిదైనా సహజత్వాన్ని ఆపాదించడం .. ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువల్లనే నానీని ప్రేక్షకులు ఒక హీరోగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. నాని ఇంతవరకూ చేసిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, వైవిధ్యానికి ఆయన ఎంతటి ప్రాధాన్యతను ఇస్తాడనేది అర్థమవుతుంది. అలాంటి నాని తాజా చిత్రంగా .. ఆయన 26వ చిత్రంగా 'టక్ జగదీష్' రూపొందింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

'టక్ జగదీశ్' అనే టైటిల్ ను ఎనౌన్స్ చేసినప్పుడే కొత్తగా వుంది .. బావుంది అనుకున్నారు. ఈ సినిమాలో నాని ఎక్కువగా 'టక్' తోనే కనిపిస్తాడు గనుక, టైటిల్ ను అలా సెట్ చేశారని అనుకున్నారు. కానీ కథా పరంగా నాని  'టక్' చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంటుందట. ఆ కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. అదేమిటనేదే ఇప్పుడు అభిమానుల్లో కుతూహలాన్ని పెంచనుంది. యాక్షన్ .. ఎమోషన్ .. డైలాగ్స్ .. సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సారి నాని నుంచి హిట్ తప్పించుకోవడం కష్టమేననేది అభిమానుల మాట.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1