సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

06-04-2021 Tue 07:21
Advertisement 1

*  అమితాబ్ లాంటి గొప్ప నటుడితో కలసి నటించడం తన అదృష్టమంటోంది కథానాయిక రష్మిక. వీరిద్దరూ కలసి ప్రస్తుతం 'గుడ్ బై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగులో తాజాగా వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక చెబుతూ, 'అమితాబ్ పక్కన ఉంటే మనం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అంతలా మనల్ని కంఫర్ట్ జోన్ లో వుంచుతారాయన. ఆయన నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చింది' అని చెప్పింది.
*  ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు జయరామ్ కలసి నటించిన 'మార్కొని మత్తయ్య' మలయాళ చిత్రాన్ని 'రేడియో మాధవ్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఎం.జయచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.    
*  తెలుగులో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రాన్ని బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ నటిస్తాడు. వెంకటేశ్ పోషించిన పాత్ర కోసం సీనియర్ నటుడిని ఎంపిక చేస్తున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1