రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

06-04-2021 Tue 06:45
Advertisement 1

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సంవత్సరాలు గడుస్తున్నా తనకు మాత్రం ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందీ ఘటన. కోనరావుపేట మండలంలోని గొల్లపల్లికి చెందిన మహేందర్ యాదవ్ (30) బీటెక్ చదువుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ హైదరాబాద్‌లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాడు.

ఇటీవల స్వగ్రామం వెళ్లిన మహేందర్‌ను తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేలా లేదని, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. దీంతో మరింత మనస్తాపానికి గురైన మహేందర్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1