మా పోరాటం ప్రభుత్వంతోనే... జవాన్లతో కాదు: చత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల ప్రకటన

05-04-2021 Mon 21:33
Advertisement 1

చత్తీస్ గఢ్ దండకారణ్యం ప్రాంతంలో శనివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 22 మంది భద్రతా బలగాల సిబ్బంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. తమ పోరాటం ప్రభుత్వంతోనే అని, జవాన్లు తమకు శత్రువులు కాదని స్పష్టం చేశారు. 4 నెలల వ్యవధిలో 28 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారని వెల్లడించారు. ఎన్ కౌంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మావోలు పేర్కొన్నారు.

కాగా, సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలను మావోలు ఎంతో తెలివిగా ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి తరెం ఏరియాలో హిడ్మా ఉన్నాడంటూ మావోలే భద్రతా బలగాలకు సమాచారం అందించగా, అది నిజమైన సమాచారమో, కాదో నిర్ధారించుకోకుండానే 2 వేల మంది బలగాలు అటవీప్రాంతంలోకి ముందుకు ఉరికాయి.

అయితే పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్న మావోలు 'యు' ఆకారంలో మోహరించి భద్రతా బలగాలు తమ పరిధిలోకి రాగానే తమ తుపాకులకు పనిచెప్పారని సమాచారం. నక్సల్స్ బాగా ఎత్తయిన ప్రాంతాల నుంచి కాల్పులు జరపడం, మూడు దిక్కుల నుంచి తూటాలు దూసుకురావడంతో భద్రతాబలగాల వైపు అధిక ప్రాణనష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1