అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి 'యే జిందగీ' పాట విడుదల

05-04-2021 Mon 20:28
Advertisement 1

అక్కినేని యంగ్ హీరో అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. తాజాగా ఈ సినిమా నుంచి 'యే జిందగీ' అనే గీతం విడుదలైంది. ఈ లిరికల్ వీడియోకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. గోపీసుందర్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడు.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1