కార్తి హిట్ మూవీ సీక్వెల్లో ధనుశ్!

05-04-2021 Mon 13:36
Advertisement 1

ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది .. స్టార్ హీరోలంతా ఇంచుమించు సీక్వెల్స్ నే లైన్లో పెడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో ధనుశ్ కూడా చేరిపోయాడు. ఈ సీక్వెల్ కి ధనుశ్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నాడు. చాలా కాలం క్రితం సెల్వరాఘవన్ .. కార్తి హీరోగా 'ఆయిరత్తిల్ ఒరువన్' సినిమాను రూపొందించాడు. హీరోగా కార్తి చేసిన మూడో సినిమా ఇది. భారీ బడ్జెట్ తో రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాలో రీమాసేన్ .. ఆండ్రియా కథానాయికలుగా అలరించారు. జానపద నేపథ్యంలో సాగే ఈ సినిమా, తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో విడుదలైంది.

అడవులు .. ఎడారులు .. ప్రాచీన రాజుల కాలంనాటి మూలాలు .. ఇలా ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ ను చేయడానికి సెల్వరాఘవన్ రంగంలోకి దిగాడు. విశేషమేమిటంటే ఈ సీక్వెల్ లో కార్తి కాకుండా ధనుశ్ కనిపించనున్నాడు.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సెల్వరాఘవన్, గ్రాఫిక్స్ వారు చేయవలసిన పనిని కూడా వాళ్లకి అప్పగించేయడం జరిగిందని అంటున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ కారణంగానే ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంత ఆలస్యం అంటే .. 2024లో విడుదల చేసేంత అన్నమాట. ఇతర నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే షూటింగు మొదలుపెడతారట.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1