ఆసక్తిని రేపుతున్న 'రిపబ్లిక్' టీజర్

05-04-2021 Mon 12:13
Advertisement 1

సాయితేజ్ కథానాయకుడిగా 'రిపబ్లిక్' సినిమా రూపొందుతోంది. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ  ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇంతవరకూ రమ్యకృష్ణ చేసిన పవర్ఫుల్ రోల్స్ లో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. రీసెంట్ గా వదిలిన ఆమె ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. "ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో .. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం .." అంటూ సాయితేజ్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది.

రాజకీయాలు .. అధికారదాహం .. వర్గపోరాటాలు .. ప్రజల మధ్య గొడవలు తదితర సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. సాయితేజ్ .. రమ్యకృష్ణ పాత్రలను ఆవిష్కరించడమే ప్రధానంగా ఈ టీజర్ సాగింది. రమ్యకృష్ణ లుక్ డీసెంట్ గా ఉంది. అలాగే సాయితేజ్ కూడా లుక్ పరంగా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. జూన్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భగవాన్ - పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. సుబ్బరాజు .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1