నేను అలా మాట్లాడటం ఎప్పటికీ జరగదు!: విజ‌య‌శాంతి

05-04-2021 Mon 10:49
Advertisement 1

ప‌లు యూట్యూబ్ ఛానెళ్లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నాయ‌ని బీజేపీ నాయ‌కురాలు, సినీ న‌టి విజ‌య‌శాంతి ఆరోపించారు. కొన్ని సినిమాల‌ను తాను ప్ర‌శంసించిన‌ట్లు ప్ర‌చారం చేసుకుంటున్నాయ‌ని అందులో నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు.  

'ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు యూట్యూబ్‌ ఛానెళ్లు అబద్ధపు ప్రచారాలతో వాళ్లు బతికి, తెలంగాణలో సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి' అని విమర్శించారు.

'వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందాం. నేను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తాను' అని చెప్పారు.

'ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్థించని ఏ ఒక్క సినిమా హీరో చిత్రాలను గాని, వ్యక్తులను గాని నేడు కేసీఆర్ గారు ఒక అవగాహనతో సమర్థిస్తున్న తీరులో నేను మాట్లాడటం ఎప్పటికీ జరగదు' అని స్పష్టం చేశారు. 

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1