సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

05-04-2021 Mon 07:22
Advertisement 1

*  ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ వెంకటరమణ' పేరిట ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఇందులో కేవలం మూడు పాటలు మాత్రమే  ఉంటాయనీ, వాటికి తమన్ అప్పుడే ట్యూన్స్ కూడా కట్టేశాడనీ తెలుస్తోంది. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం ఇంతకు ముందు భారీ షెడ్యూలును దుబాయ్ లో జరుపుకుంది. తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 15 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.    
*  వెంకటేశ్ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దృశ్యం 2' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా కేరళలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగుతో సుమారు 50 శాతం పూర్తయినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు మొత్తం పూర్తవుతుందని, జులైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1